Breaking News

ఆటోడ్రైవర్ దారుణహత్య: తల బొల్లారంలో.. మొండెం మియాపూర్‌లో..


హైదరాబాద్‌లో మరో దారుణ హత్య జరిగింది. మియాపూర్‌లోని దీప్తి శ్రీనగర్ ధర్మపురి క్షేత్రం వద్ద ప్రవీణ్(24)ను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్యచేశారు. శరీరం నుంచి వేరుచేసిన తలను బొల్లారం చైరస్తా వద్ద పడేశారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. Also Read: శుక్రవారం ఉదయం ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తల, మొండాన్ని సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాసులు అనే వ్యక్తులు ఈ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. Also Read:


By August 23, 2019 at 10:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/auto-driver-brutally-murdered-in-miyapur-hyderabad/articleshow/70798579.cms

No comments