Breaking News

పీవోకేలోకి ఉగ్రవాదులు..? హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం..


శ్మీర్ విభజన, స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఇంటెలీజెన్స్ బ్యూరో హెచ్చరికతో దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆయా గురువారం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఎయిర్‌పోర్ట్‌లతో పాటు ప్రధాన నగరాల్లోని కీలక ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. దీంతో విమానాశ్రయాల్లో పోలీసులు డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. ప్రయాణికులను అణువణువు తనిఖీ చేస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ సోదరుడు రవూఫ్ అజ్గర్ మంగళవారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముంబై, పంజాబ్‌లలోని పలు రద్దీ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాల్పడటానికి జైషే మహ్మద్ సంస్థ ప్రణాళికలు రచించినట్టు ఐబీ హెచ్చరికల ద్వారా తెలుస్తోంది. ముంబైలో విధ్వసం సృష్టించే బాధ్యతను జైషే మహ్మద్ సంస్థ ముగ్గురు ఉగ్రవాదులుకు అప్పగించినట్లు సమాచారం. నగరంలో స్లీపర్ సెల్స్ కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు ఐబీ నివేదికలో పేర్కొంది. కశ్మీర్‌లో మరో పుల్వామా తరహా దాడి జరగొచ్చన్న పాకిస్థాన్ కుట్ర పూరిత వ్యాఖ్యల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ప్రధానంగా పీవోకేలో పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్రం సైన్యాన్ని అప్రమత్తం చేసింది.


By August 08, 2019 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/central-government-announces-high-alert-in-airports/articleshow/70582161.cms

No comments