ఇంటికి వెళ్తున్న హెడ్‌మాస్టర్ కిడ్నాప్.. పోలీసుల ఉరుకులు పరుగులు
ప్రభుత్వ పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని కొందరు దుండగులు చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. పెదపూడి మండలం తొస్సిపూడిలోని ఓ ప్రభుత్వ స్కూల్‌లో సత్తి శ్రీనివాస్‌రెడ్డి హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం పాఠశాల ముగిసిన తర్వాత కారులో జి.మామిడాడలోని ఇంటికి బయలుదేరారు. బిక్కవోలు మండలం కొంకుదురు సమీపంలోకి రాగానే కొందరు దుండగులు అడ్డగించారు. ఆయన్ని బయటకు లాగి వేరే కారులో కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. శ్రీనివాసరెడ్డి రాత్రైనా ఇంటికి చేరకపోవడంతో ఆయన కుమారుడు పవన్ శివరామకృష్ణారెడ్డి బిక్కవోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసుల ఆయన కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు రాత్రి 9.30 గంటల సమయంలో కిడ్నాపర్లు శ్రీనివాసరెడ్డిని కాకినాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. దీంతో కాకినాడ పోలీసలు బిక్కవోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీనివాసరెడ్డిని ఎవరు కిడ్నాప్ చేశారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు ఎవరితోనైనా విభేదాలున్నాయా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
By August 31, 2019 at 07:58AM
No comments