అజిత్ ధోవల్, హోం శాఖ కార్యదర్శితో అమిత్ షా భేటీ
జమ్మూ కశ్మీర్లో కాల్పులు, ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన నేపథ్యంలో.. అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు హోం మంత్రి హోం శాఖ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సమావేశమయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఈ భేటీ జరిగింది. కశ్మీర్ అంశంపై చర్చించడం కోసం సోమవారం కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో.. అమర్‌నాథ్ యాత్రికులు వెంటనే వెనక్కి వెళ్లాలని కశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం సూచించింది. అమర్‌నాథ్ యాత్ర మార్గంలో పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో రూపొందిన ల్యాండ్ మైన్, అమెరికా సైన్యం వాడే ఎం24 రైఫిల్‌ను భారత సైన్యం గుర్తించింది. ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్రయత్నిస్తున్నారని, సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు వందలాది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని నిఘా హెచ్చరికలు అందాయి. దీంతో వెంటనే అమర్‌నాథ్ యాత్రను నిలిపేశారు. శ్రీనగర్ నిట్‌లో చదువుకొంటున్న విద్యార్థులను కూడా ప్రభుత్వం వెనక్కి పంపిస్తోంది. మరోవైపు భారత సైన్యం 38 వేల అదనపు బలగాలను కశ్మీర్లో మోహరిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లయినా సరే.. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలనే దిశగా సైన్యం అడుగులేస్తోందని సమాచారం.
By August 04, 2019 at 02:41PM
No comments