అమెరికాలో మళ్లీ కాల్పులు, 9 మంది మృతి.. 24 గంటల్లో రెండోసారి!
టెక్సాస్ కాల్పుల ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అమెరికాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఓహియోలో జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఆగంతకుడుగా భావిస్తోన్న వ్యక్తి సైతం మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.22 గంటలకు ఓరేగాన్ జిల్లాలో దుండగుడు కాల్పలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనలో తొమ్మిది ప్రాణాలు కోల్పోగా, 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్యం కోసం స్థానిక హాస్పిటల్‌లో చేర్పించినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై మియామీ వ్యాలీ హాస్పిటల్ అధికార ప్రతినిధి టెర్రా లిట్లీ మాట్లాడుతూ.. మొత్తం 16 క్షతగాత్రులు తమ హాస్పిటల్‌లో చేరినట్టు తెలిపారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి మాత్రం ఎలాంటి వివరాలు తెలియజేయలేదు. కాల్పుల్లో అనేక మంది గాయపడ్డారని, వారిని హాస్పిటల్‌లో చేర్పించినట్టు కెట్టారింగ్ హెల్త్ నెట్‌వర్క్ అధికార ప్రతినిధి ఎలిజిబెత్ లాంగ్ అన్నారు. డేటాన్ సమీపంలో ఉండే ఓరేగాన్ జిల్లాలో రెస్టారెంట్లు, బార్లు, థియేటర్లలతో వినోద కార్యక్రమాలకు పెట్టింది పేరు. ఏ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నదీ వివరాలను పోలీసులు తెలియజేయలేదు. టెక్సాస్‌లోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో శనివారం దుండగులు జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. Read Also: ఆయుధాలతో స్టోర్‌లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది వరకు గాయపడినట్టు అధికారులు తెలిపారు. దీనికి మూడు రోజుల కిందటే ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా నార్త్ కాలిఫోర్నియాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. అమెరికాలో ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో ఇది ఎనిమిదో అతిపెద్ద దుర్ఘటన. 1984లో శాన్ యసిడ్రోలో జరిగిన కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వాల్‌మార్ట్ కాల్పులకు పాల్పడిన అనుమానితుడ్ని పోలీసులు గుర్తించారు. అలెన్‌కు చెందిన శ్వేతజాతీయుడు (21)గా అనుమానిస్తున్నారు.
By August 04, 2019 at 02:55PM
No comments