Breaking News

అది చిరుత కాదు.. అడవి పిల్లి: ఫారెస్ట్ అధికారులు


హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి కొండగుట్టపై ఓ ఆకారం కనిపించడంతో స్థానికులు అనుకుని భయపడ్డారు. దీంతో బుధవారం కాలనీ వాసులెవరూ మార్నింగ్ వాక్‌కు వెళ్లలేదు. ఈ విషయంపై మీడియాలో భారీగా ప్రచారం జరగడంతో ఫారెస్ట్ అధికారులు ప్రగతినగర్-గాజుల రామారం మధ్య అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. గాజులరామారం డివిజన్‌ మిథులానగర్‌లో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ కొండగుట్టపై చిరుతపులి సంచరించిందన్న వీడియో చక్కర్లు కొట్టింది. దీనిపై సమాచారం అందుకున్న దూలపల్లి అటవీశాఖ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీదేవి సిబ్బందితో కలిసి వచ్చి బుధవారం ఉదయం విశ్వకర్మకాలనీ నుంచి మిథులానగర్‌ వరకు విస్తరించి ఉన్న 5కిలోమీటర్ల మేర ఫారెస్ట్ ఏరియా అంతా గాలించారు. ప్రగతినగర్‌లో జన సంచారం ఎక్కువగా ఉంటుందని, ఇక్కడ పులి సంచరించే అవకాశమే లేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం చిరుత కూర్చుందని భావించిన రాతిగుట్టపై ఓ జంతువు మలవిసర్జన చేసినట్లు గుర్తించారు. ఇది అడవి పిల్లి విసర్జన అని తెలుసుకుని అంతా ఊపిరి పీల్చుకున్నారు.


By August 01, 2019 at 09:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/leopard-not-there-in-kukatpally-pragathi-ngar-says-forest-officers/articleshow/70475817.cms

No comments