పాల వ్యాపారితో అఫైర్.. అడ్డొస్తున్నాడని కన్నకొడుకునే కొట్టి చంపింది
తమిళనాడులో దారుణం జరిగింది. పాల వ్యాపారితో పెట్టుకున్న మహిళ పేగు బందానికే మాయని మచ్చ తెచ్చింది. ప్రియుడితో సరసాలు ఆడేందుకు అడ్డుగా ఉన్నాడని ఏడాదిన్నర వయసున్న కొడుకును తీవ్రంగా కొట్టి చంపేసింది. భర్త ఫిర్యాదుతో ఆమెతో పాటు ప్రియుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా తిరువేంకటమ్ తాలూకా పళంగోటైకి చెందిన రాజ్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య వడకాశి, తానేష్ ప్రభాకరన్ అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. అయితే రోజూ ఇంటికొచ్చి పాలు పోసే స్వామినాథన్ రాజ్ అనే వ్యక్తితో వడకాశి పరిచయం పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకుంది. రాజ్ విధులకు వెళ్లిన సమయంలో స్వామినాథన్ ఆమె ఇంటికి వెళ్లి బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు రాజ్‌కు చెప్పడంతో అతడు భార్యను నిలదీశాడు. తప్పుడు దారిలో వెళ్తూ పచ్చటి సంసారాన్ని నాశనం చేసుకోవద్దని సూచించాడు. అయితే ప్రియుడి మోజులో పడిన వడకాశి తమ బంధానికి అడ్డొస్తే బిడ్డను చంపేసి స్వామినాథన్‌తో వెళ్లిపోతానని బెదిరించింది. కుటుంబం పరువు పోతుందన్న భయంతో రాజ్ వెనక్కి తగ్గాడు. భార్యతో ప్రమాదమని భావించి తన కుమారుడిని కోవిల్‌పట్టిలోని బంధువుల ఇంట్లో ఉంచాడు. అయితే సోమవారం అక్కడికి వెళ్లి పిల్లాడిని తీసుకొచ్చిన వడకాళి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఓ ఇంట్లో ఈ జంట ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పిల్లాడు ఆకలితో ఏడ్చాడు. దీంతో తమ సరసానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వడకాశి, స్వామినాథన్ బాలుడిని తీవ్రంగా కొట్టారు. అదే సమయంలో భార్య, పిల్లాడి కోసం వెతుకుతూ అటువైపుగా వచ్చిన రాజ్‌కు బాలుడి కేకలు వినిపించాయి. భర్త రాకను పసిగట్టిన వడకాశి పిల్లాడిని తీసుకుని పరుగెత్తింది. ఆమె నుంచి కొడుకుని రక్షించుకున్న రాజ్ వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. శరీరంపై తీవ్ర గాయాలుండటంతో రాజ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు ఆస్పత్రికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్ట చేయించారు. బాలుడిని తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయినట్లు తేలడంతో తల్లి వడకాశి, ఆమె ప్రియుడు స్వామినాథన్‌పై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. క్షణికాల సుఖం కోసం నవమాసాలు కని పెంచిన కొడుకునే పొట్టన పెట్టుకున్న వడకాశిపై స్థానికులు మండిపడుతున్నారు.
By August 07, 2019 at 09:31AM
No comments