పనోడి పేరిట బీమా చేయించి హత్య.. యజమాని అరెస్ట్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/70919730/photo-70919730.jpg)
తనింట్లో పనిచేసే వ్యక్తి పేరిట బీమా చేయించి ఆ డబ్బులు కొట్టేసేందుకు అతడిని హత్య చేయించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయవాది అయిన నిందితుడు మాంతుల చంద్రశేఖర్‌రెడ్డిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అవుకు మండలం మెట్టుపల్లికి చెందిన సాగె భాస్కర్‌రెడ్డి తన వద్ద పనిచేసే పాలేరు వడ్డె సుబ్బరాయుడిపై ఇన్స్యూరెన్స్ చేయించి హత్య చేయించాడు. దీన్ని రోడ్డుప్రమాదంగా చిత్రీకరించి బీమా డబ్బుల కోసం అప్లై చేశాడు. ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో కర్నూలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాంతుల చంద్రశేఖర్‌రెడ్డి తన అనుచరులు పేక్షావలి, జీనుగ శివశంకర్; జీనుగ వెంకటకృష్ణ, రమణ సాయంతో సుబ్బరాయుడిని హత్య చేయించినట్లు తేలింది. వీరికి శ్రీరామ్ ఇన్య్సూరెన్స్ సంస్థ ఉద్యోగులు మల్లేష్, శర్మ సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 25వ తేదీన భాస్కర్‌రెడ్డి, పేక్షావలి తదితరులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్‌రెడ్డిని శుక్రవారం కర్నూలు శివారులోని నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు.
By August 31, 2019 at 09:59AM
No comments