మరిదితో మహిళ అక్రమ సంబంధం.. భర్త ఏం చేశాడంటే

కుటుంబ పోషణ కోసం భర్త దుబాయ్‌లో కష్టపడుతుంటే పడక సుఖం కోసం ఆ మహిళ మరిదితో పెట్టుకుంది. భర్త దుబాయి నుంచి వచ్చినా మరిదిపై మోజుతో అతడిని పట్టించుకోకుండా పుట్టింటికి వెళ్లిపోయి సంబంధాన్ని కొనసాగిస్తోంది. కాపురానికి రావాలని భర్త ఎన్నిసార్లు కోరినా వెళ్లకుండా అనైతిక బంధమే కావాలనుకుంది. భార్యను తనకు కాకుండా చేసిన వరుసకు తమ్ముడయ్యే వ్యక్తి ఆ భర్త ప్రాణాలు తీశాడు. ఓ మహిళ కారణంగా ప్రియుడు ప్రాణాలు కోల్పోగా.. భర్త హంతకుడిగా మారాడు. Also Read: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి లక్ష్మణరావు బతుకుతెరువు కోసం ఏడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లగా అతడి భార్య పిల్లలతో కలిసి గ్రామంలోనే ఉంటోంది. వీరికి సమీపంలోనే లక్ష్మణరావు చిన్నాన కుమారుడైన సుబ్బారావు(38) నివాసముంటున్నాడు. తన కుటుంబానికి చేదోడువాడోడుగా ఉండమని తమ్ముడికి లక్ష్మణరావు చెప్పడంతో అతడు తరుచూ వారింటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో వదిన, మరిదిల మధ్య చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ ఏడాది జనవరిలో లక్ష్మణరావు స్వగ్రామానికి తిరిగివచ్చాక వారిద్దరి సంబంధం గురించి తెలిసింది. దీంతో అతడు భార్యను హెచ్చరించాడు. Also Read: అయితే సుబ్బారావుతో అక్రమ సంబంధాన్ని తెంచుకోవడం ఇష్టంలేని ఆమె భర్తను కాదనుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల తర్వాత సుబ్బారావు ఉండే వీధిలోనే ఇళ్లు అద్దెకు తీసుకుని అతడితో బంధాన్ని కొనసాగిస్తోంది. సుబ్బారావు వల్లే తన భార్య దూరమైందని కక్ష పెంచుకున్న లక్ష్మణావు అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం ఉదయం సుబ్బారావు పాలు పితికేందుకు పొలానికి వెళ్లగా అక్కడే మాటు వేసిన లక్ష్మణరావు అతడిపై కత్తితో దాడి చేశాడు. కాళ్లు, చేతులు నరికేశాడు. దీంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత లక్ష్మణరావు కత్తితో సహా ద్వారకా తిరుమల పోలీస్‌స్టేసన్‌కు వెళ్లి లొంగిపోయాడు. భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు, ఎస్ఐ సూర్యభగవాన్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సుబ్బారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:
By August 14, 2019 at 12:29PM
No comments