‘రణరంగం’ హిట్టవ్వడం హీరో-డైరెక్టర్‌కు చాలా అవసరం!

నటుడు శర్వానంద్ టాలెంటెడ్ అని అతను ఎంచుకునే పాత్రలు చూస్తూనే అర్ధమవుతుంది. తన పాత్రకు న్యాయం చేసే విధంగా సినిమాలు ఎంచుకుంటాడు శర్వా. గత సినిమాలు నుండి శర్వా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అతని చేసిన సినిమాలు ఏమి ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాయి.
‘శతమానం భవతి’ తర్వాత శర్వా నుంచి సంతృప్తి చెందే సినిమా రాలేదు. ఈ మూవీ తరువాత వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ పూర్తిగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం శర్వా ఆశలన్నీ ‘రణరంగం’ మీదే పెట్టుకున్నాడు. ఇక ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. సుధీర్ వర్మ ఈచిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ‘కేశవ’తో ఆశించిన విజయం అందుకోలేకపోయాడు సుధీర్ వర్మ. సో.. సుదీర్‌కి కూడా ‘రణరంగం’ హిట్ అవ్వడం చాలా అవసరం. ఇది హిట్టయితే ఈ డైరెక్టర్‌కి అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశముంది.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే చాలా బాగుంది. సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. ఇందులో శర్వా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో మెప్పిస్తాడనే నమ్మకం ఆడియన్స్‌లో ఉంది. ఈ మూవీ తరువాత శర్వా 96 అనే తమిళ చిత్రం రీమేక్ చేస్తున్నాడు.
By August 15, 2019 at 05:04AM
No comments