హరితహారం మొక్కను తిన్న మేక.. యజమానికి భలే ‘శిక్ష’!
ఇటీవల చిలుకూరులో మేక హరిత హారం మొక్కను తిన్నందుకుగానూ దాని యజమానికి రూ. 500 ఫైన్ విధించిన ఘటన వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. జిల్లాలో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. కోటపల్లి మండలం బార్వాద్ గ్రామంలో ఓ మేక మొక్కను తినేసింది. దీంతో గ్రామ సర్పంచ్ ఆమెతో 20 మొక్కలు నాటించారు. దగ్గరుండి మరీ ఆమెతో మొక్కలు నాటించిన సర్పంచ్.. ఎవరి ఇంట్లోని పశువులు, జంతువులైనా మొక్కలను తింటే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 24 శాతం అటవీ విస్తీర్ణం ఉండగా.. దాన్ని 33 శాతాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు హరిత హారం పథకాన్ని ప్రారంభించింది. 2015లో చిలుకూరులో సీఎం కేసీఆర్ ‘తెలంగాణకు హరితహరం’ను ప్రారంభించారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో విషయం ఏంటంటే.. మొక్కలు నాటిస్తోన్న ప్రభుత్వమే ఊళ్లో జనాలకు మేకలు, గొర్రెలను కూడా పంపిణీ చేసింది. జీవాల పెంపకం ద్వారా ప్రజలకు ఆదాయం పెరుగుతుందని సీఎం కేసీఆర్ భావించారు. నాటిన మొక్కల చుట్టూ రక్షణగా కంచె ఏర్పాటు చేస్తే వాటిని మేకలు, గేదెలు తినే అవకాశం ఉండదు కదా అని కొందరు సూచిస్తున్నారు.
By August 26, 2019 at 12:47PM
No comments