తల్లిదండ్రుల కళ్లుగప్పి పిల్లల కిడ్నాప్!
తెలుగు రాష్ట్రాల్లో వరుస కిడ్నాప్ ఘటనలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేపుతున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవల వ్యాపారి కిడ్నాప్, హయత్ నగర్‌లో యువతి అపహరణ లాంటి వరుస ఘటనలు మరువక ముందే శంషాబాద్‌లో శుక్రవారం (ఆగస్టు 1) మరో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఓ తల్లిదండ్రుల కళ్లుగప్పి పిల్లలను కిడ్నాప్ చేయడానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ముంబై నుంచి ఒక కుటుంబం విమానంలో హైదరాబాద్‌కు వచ్చింది. ఎయిపోర్టులో దిగిన ఆ ఫ్యామిలీ నగరంలోకి రావడానికి రెండు క్యాబ్‌లు బుక్ చేసుకుంది. ఒక క్యాబ్‌లో తల్లిదండ్రులు, మరో క్యాబ్‌లో ముగ్గురు పిల్లలు ఎక్కారు. అయితే పిల్లల్ని తీసుకెళుతున్న క్యాబ్ డ్రైవర్ తల్లిదండ్రుల కళ్లుగప్పి వారిని కిడ్నాప్ చేయడానికి యత్నించాడు. Read also: వెంటనే గమనించిన తల్లిదండ్రులు కారులో వెంబడించారు. భయపడిన క్యాబ్ డ్రైవర్.. పిల్లల్ని, లగేజీని రోడ్డుపై దించి పరారయ్యాడు. అప్పటికే కారులో ఉన్న క్యాబ్ డ్రైవర్ స్నేహితుడు మాత్రం దొరికిపోయాడు. తల్లిదండ్రులు అతణ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
By August 02, 2019 at 01:51PM
No comments