Breaking News

ఉన్నావో రేప్ కేసు... మీడియాకు సుప్రీం కీలక ఆదేశాలు!


దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోన్న ఉన్నావో రేప్ బాధితురాలి ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో రెండో రోజూ విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన కేసులన్నింటినీ ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీచేయాలని సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. బాధితురాలికి జరిగిన ప్రమాదం ఘటనపై విచారణ వారం రోజుల్లోనే పూర్తిచేయాలని సూచింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు, ఆమె తరఫు లాయర్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీం ఏర్పాటుచేసిన ప్యానల్ శుక్రవారం నివేదిక సమర్పించింది. బాధితురాలికి ఇంకా వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. లాయర్‌కు గురువారం వెంటిలేటర్ సాయం తొలగించారని, ఇద్దరికీ ఊపిరి పీల్చుకోడానికి గొంతులో అమర్చిన పైపును కూడా తొలగించినట్టు వివరించింది. Read Also: మరోవైపు, తమ కుమార్తె ఇంకా సృహలోకి రాలేదని, ఇక్కడే చికిత్స కొనసాగించాలని ఆమె కుటుంబసభ్యులు తెలిపినట్టు ధర్మాసనానికి సొలిసిటరీ జనరల్ తెలియజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాతే ఎయిమ్స్‌కు తరలించాలని ఆమె తరఫు లాయర్ తెలిపారు. మరోవైపు, ఈ కేసు విషయంలో మీడియాకు కొన్ని కీలక ఆదేశాలు జారీచేసింది. ఉన్నావో ఘటనకు సంబంధించిన కేసులు, సంఘటనల్లో అత్యాచార బాధితురాలి పేరును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రస్తావించరాదని ఆదేశించింది. ఆమె గోప్యతను కాపాడాలని పేర్కొంది. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించినట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. అలాగే క్రిమినల్ కేసులో అరెస్టయి రాయబరేలీ జైల్లో ఉన్న బాధితురాలి బంధువును తీహార్ జైలుకు తరలించడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని యోగి ప్రభుత్వం పేర్కొంది. Read Also: బాధితురాలు, ఆమె లాయర్‌ సహా కుటుంబానికి సీఆర్పీఎఫ్‌తో భద్రత కల్పించినట్టు కేంద్రం వివరించింది. అలాగే, లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో తమ కుమార్తెకు చికిత్స కొనసాగించాలని బాధిత యువతి కుటుంబం సుప్రీంకి విన్నవించింది. అవసరమైతే ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించడానికి ఎయిర్ అంబులెన్స్ వినియోగించవచ్చని ఉద్ఘాటించారు. ఉన్నావో ఘటన లోక్‌సభలో ప్రకంపనలు రేపుతోంది. దీనిపై లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ కే సురేశ్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.


By August 02, 2019 at 12:54PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-orders-media-not-to-disclose-the-name-of-unnao-rape-survivor/articleshow/70494944.cms

No comments