Breaking News

జబర్దస్త్‌లో ఈ కమెడియన్‌కే అధిక శాలరీ!


గత ఆరేళ్ళనుండి ఈటీవీలో దిగ్విజయంగా ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకి ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఈటీవీ జబర్దస్త్ షోని పడుకోబెట్టాలని చాలా ఛానల్స్ చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసి చతికిలపడ్డాయి... కానీ జబర్దస్త్‌ని కొట్టలేకపోయాయి. ఇక జబర్దస్త్ లో కామెడీ తో పాటు హాట్ యాంకర్స్ చేసే యాంకరింగ్, నాగబాబు, రోజా జడ్జిమెంట్ కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ గెస్ట్స్ కూడా జబర్దస్త్ షోకి వన్నెతెచ్చారు. కొన్నిసార్లు జబర్దస్త్ స్కిట్స్ వలన కాంట్రవర్సీలు జరిగాయి. ఇక జబర్దస్త్ లో కామెడీ చేసి ఇల్లుకొన్నోళ్లు, కారులు కొన్నోళ్ళు ఉన్నారు.. ఇంకా వెండితెర మీద సెటిల్ అయినవాళ్లు ఉన్నారు. 

ఇక కామెడీ షోలకి రారాజు జబర్దస్త్ కామెడీ షో లో ఇప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది ఎవరో తెలుసా... గురువారం అనసూయ యాంకరింగ్ లో వచ్చే జబర్దస్త్ షోలో హైపర్ ఆది ఎక్కువగా స్కిట్స్ కొడుతుంటాడు. తరువాత శుక్రవారం రష్మీ యాంకరింగ్ లో వచ్చే ఎక్స్ట్రా జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర నే హైయ్యెస్ట్ స్కిట్స్ కొట్టినోడు. చంద్ర స్కిట్ అంటే చెవులు కోసేసుకుంటారు. అంతలా కడుపుబ్బా నవ్విస్తాడు చంద్ర. అందుకే చమ్మక్ చంద్ర జబర్దస్త్ లో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే యాక్టర్. చంద్రకి ఒక్కో నెలకు 3 నుంచి 4 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. చంద్ర తర్వాతి స్థానంలో సుడిగాలి సుధీర్ ఉన్నాడు. సుధీర్ నెలకి నుంచి 3.5 ల‌క్ష‌లు అందుకుంటున్నాడని సమాచారం. అదే జబర్దస్త్ జడ్జెస్ అయినా రోజా ఎపిసోడ్‌కి 3 నుండి నాలుగు లక్షలు... అంటే నెలకి ఎనిమిది ఎపిసోడ్స్ గనక 25 లక్షల దాక రోజా సంపాదన ఉంటుంది. ఇక నాగబాబు రమారమి 25 నుండి 30 లక్షల వరకు అందుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. 



By August 30, 2019 at 06:05AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47246/chammak-chandra.html

No comments