Breaking News

‘కెజిఎఫ్2’ షూటింగ్ అంతరాయానికి కారణమిదే!


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా కన్నడలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి.. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై అదిరిపోయే హిట్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన కెజిఎఫ్ సినిమాకి ధీటుగా దర్శకుడు ప్రశాంత్ నీల్.. కెజిఎఫ్ 2 ని డైరెక్ట్ చేస్తున్నాడు. కెజిఎఫ్‌ని మంచి బడ్జెట్ తో తెరకెక్కించిన నిర్మాతలు.. ఆ సినిమా హిట్ అవడంతో కెజిఎఫ్‌2ని భారీగా నిర్మిస్తున్నారు. కెజిఎఫ్ 2 మీద ఇండియా వైడ్ గా భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. రీసెంట్ గా విడుదలైన సంజయ్ దత్ లుక్ అందరిని ఆకట్టుకుంది.

ప్రస్తుతం ప్రశాంతంగా షూటింగ్ జరుపుకుంటున్న కెజిఎఫ్ 2 షూటింగ్ కి తాజాగా బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. కారణం ప్రస్తుతానికి కెజిఎఫ్ టీం మొత్తం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో ఉంది. అక్కడ సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చేపట్టింది. అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో సైనైడ్ హిల్స్ ఏరియాలో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల షూట్ చేస్తున్నప్పుడు.. ఆ ఏరియాలోని ఓ వ్యక్తి .. అక్కడ సినిమా షూటింగ్ చెయ్యడం ఆపాలని.. కెజిఎఫ్ టీం పై కోర్టుకెక్కాడు. సైనైడ్ హిల్స్ ఏరియాలో షూటింగ్ కోసం సెట్స్ గట్రా వెయ్యడం వలన అక్కడ పర్యావరణం దెబ్బతింటుందని.. ఆ వ్యక్తి కోర్టుకి తెలపడంతో.. అక్కడి జేఎంఎఫ్ సీ స్పెషల్ కోర్టు కెజిఎఫ్ షూటింగ్ కి బ్రేకులు వేసింది. ప్రస్తుతం సీరియస్ గా సాగుతున్న షూటింగ్ కి ఇప్పుడు బ్రేక్ పడడంతో.. కెజిఎఫ్ టీం కాస్త వర్రీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. 



By August 30, 2019 at 06:08AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47247/kgf-chapter-2.html

No comments