Breaking News

వ్యభిచారం చేయాలంటూ వేధింపులు.. చెల్లెలిపై అన్న అత్యాచారం


తల్లి, సోదరుడు, భర్త తనను చేయాలని వేధిస్తున్నారంటూ ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడం ముంబయిలో కలకలం రేపింది. ముంబయిలోని మాన్‌ఖుర్ద్ ప్రాంతంలో 15ఏళ్ల బాలిక తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి నివసిస్తోంది. గతేడాది ఏప్రిల్ నెలలో ఆమెకు 35ఏళ్ల వ్యక్తితో తల్లిదండ్రులు బాల్య వివాహం జరిపించారు. అయితే భర్త సెక్స్ కోసం దారుణంగా వేధించడంతో పాటు శారీరక దాడికి పాల్పడటంతో బాలిక భయపడి పుట్టింటికి వచ్చేసింది. Also Read: కొద్దిరోజులు పుట్టింట్లో బాగానే ఉన్న బాలికకు అక్కడ కూడా వేధింపులు మొదలయ్యాయి. కుటుంబ పోషణ కోసం వ్యభిచారం చేయాలంటూ తల్లి, సోదరుడితో పాటు భర్త కూడా వేధించడం మొదలుపెట్టారు. తాము తీసుకొచ్చే వ్యక్తులతో వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించాలంటూ ఆమెను తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. దానికి ససేమిరా అన్న బాలిక కొద్దిరోజులు మౌనంగా ఉంది. వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఆదివారం మాన్‌ఖుర్ద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. 60ఏళ్ల వృద్ధుడితో వ్యభిచారం చేయాలంటూ కుటుంబసభ్యులు ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. Also Read: వారి వేధింపులను బరించలేని బాలిక సమీపంలోని పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యులు, భర్త, సోదరుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వ్యభిచారం చేయాలంటూ బలవంతపెడుతున్నారని ఫిర్యాదు చేసింది. వ్యభిచారం చేయాలని బెదిరిస్తూ సోదరుడు తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని చెప్పి బోరుమంది. బాలిక ఫిర్యాదుపై వేగంగా స్పందించిన పోలీసులు మొత్తం ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. ఆదివారం బాలిక తల్లితో పాటు, సోదరుడు, భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 60ఏళ్ల వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. Also Read:


By August 19, 2019 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mumbai-girl-complaint-against-family-to-forced-to-her-prostitution-says-her-brother-too-raped-her/articleshow/70733089.cms

No comments