Breaking News

వాయిదా ప‌డ్డ ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌


విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్ర‌హాన్ని తాడేప‌ల్లిగూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో ఈ నెల 25(ఆదివారం)న ఆవిష్క‌రించేందుకు ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ జ‌ర‌గాల్సి ఉంది. 

అయితే ఈ ఆవిష్క‌ర‌ణ కార‌ణాంత‌రాన వాయిదా వేశామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్రభుత్వం నుండి అనుమ‌తులు ఇంకా మంజూరు కాలేదని, అన్ని అనుమతులు తీసుకుని త్వ‌ర‌లోనే కొత్త తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించారు.



By August 25, 2019 at 03:09AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47191/chiranjeevi.html

No comments