రెండో పెళ్లికి ఒప్పుకోలేదని.. లేడీ కానిస్టేబుల్‌కు బలవంతంగా తాళి కట్టేశాడు
భర్త చనిపోయినా కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ నలుగురు కుమార్తెలను పోషిస్తున్న మహిళపై ఆమె మేనబావే కన్నేశాడు. భార్యా పిల్లులున్నా ఆమెను రెండో పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోయేసరికి బలవంతంగా తాళి కట్టేశాడు. ఈ ఘటన మంచిర్యాలలో గురువారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చింతర రజిత అనే మహిళ భర్త ఆరు నెలల క్రితం చనిపోయాడు. ఆమెకు నలుగురు కుమార్తెలున్నారు. రజితకు వరుసకు మేనబావ అయిన కుమారస్వామి ఆమెను రెండో పెళ్లి చేసుకుంటానంటూ వేధిస్తున్నాడు. దీనికి ఆమె నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో గురువారం కలెక్టరేట్ గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న రజిత వద్దకు వచ్చిన కుమారస్వామి ఆమెతో మాటలు కలిపాడు. ఒక్కసారిగా ఆమె మెడలో తాళి కట్టేశాడు. దీనిపై మనస్తాపం చెందిన రజిత.. కుమారస్వామిపై పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కుమారస్వామిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
By August 31, 2019 at 08:56AM
No comments