Breaking News

వివాహితతో అక్రమ సంబంధం.. ఆమెపై అలిగి యువకుడి ఆత్మహత్య


భర్తను వదిలేసి పిల్లలతో వేరుగా జీవిస్తున్న మహిళతో పెట్టుకున్న యువకుడు ఆమెపై అలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ పోషణకు డబ్బులు ఇవ్వకపోవడంతో తనను వదిలేయాలని మహిళ హెచ్చరించడంతో యువకుడు మనస్తాపం చెందాడు. ఆమె సూటిపోటి మాటలకు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. Also Read: కృష్ణా జిల్లా పట్టణంలోని ధనియాలపేటకు చెందిన మహిళ భర్తతో విభేదాల కారణంగా వేరుగా ఉంటోంది. కొద్దికాలం పాటు స్థానికంగా ఉండే టాక్సీ డ్రైవర్‌తో అక్రమ సంబంధం కొనసాగింది. తర్వాత అతడిని వదిలేసి మత్స్యశాఖ అధికారుల అద్దెకారుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న తెర్లి శ్రీనివాస్‌ (30) అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అవివాహితుడైన శ్రీనివాస్ నుంచి తన కుటుంబ పోషణ కోసం నెలనెలా డబ్బులు తీసుకుంటోంది. ఆమె కొడుకు, కూతురు హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. కొద్దిరోజులుగా శ్రీనివాస్ డబ్బులు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా ఉందని, తనను వదిలేసే వేరే దారి చూసుకుంటానని చెబుతోంది. దీనికి శ్రీనివాస్ అంగీకరించడం లేదు. Also Read: సోమవారం ప్రియురాలి ఇంటికి వెళ్లిన శ్రీనివాస్ చికెన్ పకోడి తినిపించేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. ‘ నా కుటుంబాన్ని పోషించలేని వాడివి ఇక్కడికి రాకు. మరోసారి వస్తే మీ నాన్నతో చెబుతా’ అంటూ హెచ్చరించింది. తనను దూరం పెడితే ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాస్ బెదిరించినా ఆమె పట్టించుకోలేదు. మంగళవారం ఉదయం ఆమె తన కుమార్తెను స్కూల్‌లో దించి వచ్చేసరికి ఇంటి తలుపు లోపల గడియపెట్టి ఉంది. కిటికీలోంచి చూడగా శ్రీనివాస్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె స్థానికుల సాయంతో తలుపు పగులగొట్టి చూడగా అప్పటికే మృతిచెందాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By August 21, 2019 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-commits-suicide-due-to-argue-with-lover-in-guduwada/articleshow/70764420.cms

No comments