సైనికుడి భార్యతో అఫైర్.. సోషల్‌మీడియాలో నగ్నచిత్రాలు అప్‌లోడ్

స్నేహితుడే కదా అని నమ్మించి ఇంటికి రానిచ్చిన పాపానికి అతడి భార్యతోనే అఫైర్ పెట్టుకున్నాడో వ్యక్తి. సైనికుడైన స్నేహితుడు దేశ సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉంటే ఇక్కడ అతడి భార్యతో రాసలీలలు కొనసాగిస్తూ స్నేహ బంధానికే మచ్చ తెచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో జరిగింది. కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపంలోని కాప్పికాడు ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్ బైకులను విక్రయిస్తుంటాడు. కొంతకాలం క్రితం పంచమూర్తి ప్రాంతానికి చెందిన ఓ సైనికుడు రమేష్ వద్ద బైకు కొన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి పరిచయం స్నేహంగా మారింది. దీంతో రమేష్ అప్పుడప్పుడూ సైనికుడు ఇంటికి వెళ్తుండటంతో అతడి భార్యతో చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. సైనికుడు ఇంట్లో లేని సమయంలో వారిద్దరు రాసలీలలు సాగించేవారు. ఈ క్రమంలోనే ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో రమేష్ సెల్‌ఫోన్లో ఫోటోలు తీశాడు. ఇటీవల రమేష్ ఫోన్‌ను ఆయన భార్య ఓపెన్ చేయగా ఆ ఫోటోలు కనిపించాడు. దీంతో భర్త తనను మోసం చేస్తున్నాడని భావించి ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో పెట్టేసింది. ఈ విషయం సైనికుడికి తెలియడంతో రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీులు కేసు నమోదు చేసుకుని రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై బాధితురాలు ఎలాంటి ఫిర్యాదు చేయనట్లుగా తెలుస్తోంది
By August 19, 2019 at 08:10AM
No comments