Breaking News

ముస్లింలు, క్రిస్టియన్లకు వైఎస్ జగన్ సర్కారు గుడ్ న్యూస్..


ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సర్కారు సంక్షేమ ప్రభుత్వంగా పేరొందిన సంగతి తెలిసిందే. నవరత్నాల అమలుతో జగన్ సర్కారు పట్ల సామాన్య ప్రజానీకం సానుకూలంగా ఉంది. అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు ప్రారంభించిన జగన్.. ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జెరూసలెం, హజ్‌ యాత్రికులకు సీఎం జగన్ ఆర్థిక చేయూత ప్రకటించారు. ఈ యాత్రలకు వెళ్లే వారికి ఆర్థిక సాయాన్ని చెప్పుకోదగ్గ రీతిలో పెంచారు. వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉన్నవారికి రూ.60 వేలు, ఆపై ఉన్నవారికి రూ.30 వేల చొప్పున చేయూత అందిస్తామని సీఎం తెలిపారు. ఇప్పటి వరకూ జెరూసలెం వెళ్లే క్రిస్టియన్లకు రూ. 40 వేలు, రూ. 20 వేల చొప్పున ప్రభుత్వం సాయం చేస్తోంది. క్రైస్తవులు జెరూసలెం వెళ్లేందుకు అందిస్తోన్న సాయాన్ని జగన్ సర్కారు రెట్టింపు చేయడం గమనార్హం. సీఎం జగన్ కూడా ఇటీవలే జెరూసలెం వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. Read Also: గురువారం జరిగిన రివ్యూ మీటింగ్ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ముస్లింలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ 2020 నుంచి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఇమామ్‌లకు పెంచిన గౌరవ వేతనం రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేలు అందజేయాలన్నారు. ఉగాది పర్వదినాన ఇళ్ల స్థలాల పంపిణీలో మైనార్టీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. హజ్ సబ్సిడీని రద్దు చేసిన కేంద్రం.. ఏటా భారత్ నుంచి సౌదీలోని హజ్‌కు భారీగా ముస్లింలు తరలివెళ్తుంటారు. ఈ ఏడాది ఆరంభంలో భారత్ హజ్ కోటాను 2 లక్షలకు పెంచుతూ సౌదీ నిర్ణయం తీసుకుంది. కానీ సుప్రీం ఆదేశాల మేరకు హజ్‌ యాత్రకు ఇచ్చే సబ్సిడీని తగ్గించుకుంటూ వచ్చిన కేంద్రం తర్వాత దాన్ని రద్దు చేయాలని గత ఏడాది ఆరంభంలో నిర్ణయించింది. ఈ నిధులను మైనార్టీల సంక్షేమానికి ఉపయోగిస్తోంది. హజ్ సబ్సిడీని తొలగించండి. ఆ డబ్బును ముస్లిం బాలికల చదువు కోసం ఖర్చు చేయండని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రభుత్వానికి సూచించారు.


By August 30, 2019 at 07:41AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ap-govt-increases-haj-and-jerusalem-subsidy-to-rs-60-thousand-for-poor/articleshow/70902366.cms

No comments