Breaking News

ఆమీర్, సల్మాన్ సినిమాలకు పోటీగా ‘సాహో’


ప్రభాస్ నుండి బాహుబలి తర్వాత వస్తున్న సాహో చిత్రంతో ట్రేడ్‌లోనే కాదు.... ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయనడానికి రీసెంట్‌గా రామోజీ ఫిలిం సిటీలో జరిగిన సాహో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంటే సాక్ష్యం. ప్రభాస్ ఫ్యాన్స్ లక్షమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారంటే.. సాహో క్రేజ్ ఏ లెవల్లో ఉందో తెలుస్తుంది. సుజిత్ అనే యంగ్ డైరెక్టర్ ఇంత భారీగా సినిమాని తెరకెక్కించాడంటే.. ఇప్పటికి చాలామందికి జీర్ణం కావడం లేదు. సాహో ఖర్చుని ఇంచుమించు ప్రభాస్ మాటల్లో 350 కోట్లు అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఖర్చు మొత్తం సాహో థియేట్రికల్ హక్కుల కిందే వచ్చేసింది. సాహో అన్ని భాషలకు కలిపి ఈ రేంజ్ ప్రైస్ వచ్చింది. మరి కేవలం థియేట్రికల్ రైట్స్ కే ఆ రేంజ్ ప్రైస్ వస్తే మిగిలిన హక్కులకు అంటే శాటిలైట్, డిజిటల్ హక్కుల కింద ఎంత రావాలి.

ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో అదే ముచ్చట నడుస్తుంది. ట్రైలర్ తోనే భారీ నుండి అతి భారీ అంచనాలు పెంచేసిన సాహో చిత్రం.. ఇప్పుడు జరిగే ప్రమోషనల్ కార్యక్రమాలతోను సినిమా మీద మరింత హైప్ పెంచుతుంది. మరి ఆ రేంజ్ క్రేజ్ ఉన్న సాహో హిందీ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్‌కి 85 కోట్లకి డీల్ సెట్ చేసినట్లుగా నేషనల్ మీడియా టాక్. బాహుబలితో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ప్రభాస్ సాహో తోనూ అందరిలో ఎంతగా ఇంట్రెస్ట్ పుట్టించాడో ఈ డీల్ చూస్తే తెలుస్తుంది. 

కేవలం సల్మాన్, ఆమీర్ ఖాన్ సినిమాలకు వచ్చే శాటిలైట్, డిజిటల్ హక్కుల రేటు ఇప్పుడు సాహో చిత్రానికొచ్చింది అంటే.. ప్రభాస్ బాలీవుడ్ క్రేజ్ ఏ లెవల్లో ఉందో తెలుస్తుంది. ఇక హిందీలో ఇలా ఉంటే.. ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం కలిపి సాహో డిజిటల్, శాటిలైట్ హక్కులకు 110 కోట్లకి యువీ వారు బేరం పెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. అంత రేటుకి కాస్త వెనుకాముందు ఆడినా.. ఫైనల్‌గా 100 కోట్లు రావడం ఖాయమంటున్నారు. మరి ప్రభాస్ సాహో క్రేజ్ ఆకాశాన్ని తాకింది. విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ.. సాహో క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది తప్ప తరగడం లేదు.



By August 21, 2019 at 02:47AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47135/saaho.html

No comments