Breaking News

టెక్కీ మర్డర్ కేసులో ట్విస్ట్... హేమంత్ ఫ్రెండ్‌తో సతీశ్‌కు అక్రమ సంబంధం!


కేపీహెచ్‌బీ కాలనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ దారుణహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సతీష్‌ను ఆయన స్నేహితుడు హేమంత్ దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండొచ్చని మొదట పోలీసులు అనుమానించారు. మరింత లోతుగా దర్యాప్తు చేయగా వివాహేతర సంబంధం కోణం వెలుగులోకి వచ్చింది. Also Read: ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన సతీశ్‌బాబు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన హేమంత్‌ తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ సైనిక్‌ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. వేర్వేరు చోట్ల ఉన్నత చదువులు పూర్తిచేశాక కేపీహెచ్‌బీ ఏడోఫేజ్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రారంభించారు. సతీశ్‌బాబు తన భార్య, కుమార్తెతో కలిసి మూసాపేటలోని ఆంజనేయనగర్‌లో ఉంటున్నారు. హేమంత్‌ కొంతకాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కుమార్తెకు దూరంగా కేపీహెచ్‌బీ కాలనీలోనే ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నెల 28న రాత్రి 10 గంటల సమయంలో కంపెనీలో పని పూర్తిచేసుకున్న సతీశ్‌బాబు ఇంటికి బయలుదేరినట్లు భార్యకి ఫోన్ చేసి చెప్పాడు. తర్వాతి రోజు మధ్యాహ్నమైన భర్త ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడిన సతీశ్‌ భార్య ప్రశాంతి కేపీహెబ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు అతడి ఫ్రెండ్ హేమంత్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. సతీశ్‌ ఫోన్ సిగ్నల్ చివరిసారిగా హేమంత్ ఉంటున్న ఇంటి సమీపంలోనే చూపించడంతో 29వ తేదీన రాత్రి సమయంలో అతడి ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుదిరుగుతుండగా లోపలి నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా సతీశ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరుతున్నట్లు భార్యకు ఫోన్ చేసిన సతీశ్ అక్కడి నుంచి హేమంత్‌ దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో హేమంత్ ఆవేశంతో సతీశ్‌ కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని ముందుగా అనుమానించినా అక్రమ సంబంధం కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. హేమంత్ ఫ్రెండ్ ప్రియాంకతో సతీశ్ సన్నిహితంగా మెలుగుతున్నాడని, వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. తన ఫ్రెండ్‌తో సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేకే హేమంత్.. సతీశ్‌ను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ కేసులో స్పష్టత తెచ్చేందుకు పోలీసులు పలువురిని విచారిస్తున్నారు. సతీశ్‌ను హత్య చేసిన సమయంలో ఇంట్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు కొందరు చెబుతుండటంతో ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.


By August 31, 2019 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kphb-police-continues-investigation-in-software-engineer-murder-case/articleshow/70919929.cms

No comments