Breaking News

AA 19 First Glimpse: అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’.. ఫస్ట్ పంచ్ పేలిందే!


‘అల వైకుంఠపురములో’.. అంటూ సందడి మొదలు పెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 19వ మూవీ టైటిల్‌ను విడుదల చేశారు. ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. బన్నీ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. నివేతా పేతురాజ్ మరో హీరోయిన్‌. టబు, జయరాం, సుశాంత్‌, మురళీ శర్మ, హర్షవర్థన్, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఇప్పటి వరకూ చాలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నప్పటికీ.. త్రివిక్రమ్ మార్క్‌కి తగ్గట్టుగా ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు బన్నీ, మురళీశర్మల మధ్య సరదా సన్నివేశాన్ని రివీల్ చేశారు. ఇందులో బన్నీ- మురళీ శర్మలు తండ్రీ కొడుకులుగా నటిస్తుండగా.. ‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్ అని మురళీశర్మ అడగడం.. ఇవ్వలా వచ్చింది’ అని బన్నీ పంచ్ పేల్చుతున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా జనవరిలో థియేటర్స్‌లో సందడి చేయబోతుంది ‘అల వైకుంఠపురములో’.


By August 15, 2019 at 11:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-19th-movie-with-trivikram-ala-vaikunthapuramulo-first-glimpse-released/articleshow/70687142.cms

No comments