73 Independence Day: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని ఎర్రకోటపై నుంచి ఆరోసారి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి ప్రసంగం చేశారు. అంతకముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ప్రధాని మోదీ ప్రసంగం.. *స్వాంతంత్ర్య సమరయోధులకు వందనం.. దేశం కోసం ప్రాణాలర్పించి ప్రతి ఒక్కరికి వందనం. *దేశంలో అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి.. వరదల్లో చనిపోయిన వారికి నా నివాళి *2019 ఎన్నికల తర్వాత ఇది నా తొలి ప్రసంగం.. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. *10వారాల్లో దేశం కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. *ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ ఆకాంక్షను నెరవేర్చాం. *ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచాం. *ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు స్వేచ్ఛ లభించింది. *ముస్లిం మహిళలకు ఇప్పుడు సమాన హక్కులు లభించాయి. *చిన్నారులపై లైంగిక వేధింపులను నివారించేందుకు కఠిన చట్టాలు *దేశం మారుతుందన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంది. *130మంది కోట్లమంది భారతీయులు నన్ను ముందుండి నడుపుతున్నారు. *ఐదేళ్లలో సమిష్టిగా సరికొత్త భారతావనిని ఆవిష్కరిద్దాం
By August 15, 2019 at 07:53AM
No comments