Breaking News

వడోదరను వణికించిన వరుణుడు... ఒక్కరోజులోనే రూ.50సెం.మీ.ల వర్షం


గుజరాత్‌లోని వడోదర నగరాన్ని వరుణుడు ముంచెత్తాడు. బుధవారం నుంచి గురువారం వరకు 24గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 50శాతం వర్షపాతం నమోదు కావడంతో ఆ నగరం నీట మునిగింది. దీంతో అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. బుధవారం రాత్రి బజ్వా ప్రాంతంలో ఓ ప్రాంతంలో గోడ కూలి నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా వడోదరలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నీట మునిగిన నగరానికి రోడ్డు, రైలు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే శాఖ కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించింది. హరిద్వార్ మెయిల్, ప్రేరణ ఎక్స్ ప్రెస్, ముంబై -అహ్మదాబాద్ లోక్ శక్తి ఎక్స్ ప్రెస్, జంబూసర్-ప్రతాపనగర్ ప్యాసింజరు, వడోదర ప్యాసింజరు, ఆనంద్ బహరుచ్ రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. బుధవారం నుంచి మూసి ఉంచిన ఎయిర్‌పోర్టును గురువారం రాత్రి తెరిచారు. భారీ వర్షాలకు విశ్వామిత్రి నది పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట ముంపులోనే కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయచర్యలు ముమ్మరం చేసినట్లు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. వడోదరకు వర్షపు ముప్పు ఇంకా తొలగిపోలేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నగరంతో పాటు వల్సాద్, బహరుచ్, నవసారి, తాపి , బానసకాంత, పటాన్ జిల్లాల్లో శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


By August 02, 2019 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/vadodara-city-receives-50-cm-rainfall-within-24-hours-scholls-closed-trains-cancelled/articleshow/70491431.cms

No comments