Breaking News

మాయమవుతున్న రూ.2 వేల నోటు.. పెరుగుతున్న ఆ నోటు వాడకం, మోదీ స్కెచ్ అదేనా?


మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే. ఈ నిర్ణయం ప్రభావంతో సామాన్య ప్రజానీకం చాలా కాలంపాటు ఇబ్బందులు పడ్డారు. వెంటనే ప్రత్యామ్నాయంగా కొత్త నోట్లను తీసుకొచ్చిన కేంద్రం.. రూ. 2 వేల నోట్లను అధిక సంఖ్యలో ముద్రించింది. కానీ మోదీ సర్కారు మెల్లగా రూ. 2 వేల నోట్ల ముద్రణను తగ్గిస్తోంది. రూ.2 వేల నోట్ల సంఖ్యను తగ్గిస్తోందని గణాంకాలను బట్టి అర్థం అవుతోంది. నోట్ల రద్దుతో ప్రజలకు కరెన్సీ కష్టాలు ఎదురవడంతో.. 2017 మార్చిలో రూ. 2000 నోటును మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మార్కెట్లో ఈ నోట్లే సగం కనిపించాయి. ఏడాది తర్వాత వీటి వాటా 37 శాతానికి తగ్గింది. ప్రస్తుతం రూ.2 వేల నోటు వాటా 31 శాతానికి పరిమితమైంది. రూ. 2 వేల నోట్ల సంఖ్యను మెల్లగా మార్కెట్ నుంచి ఉపసంహరించడమే మోదీ సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో మార్కెట్లో మిగతా నోట్ల వాటా పెరిగింది. ముఖ్యంగా రూ.500 నోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో 21.1 లక్షల కోట్ల బ్యాంకు నోట్లు సర్క్యులేషన్‌లో ఉండగా.. అందులో 51 శాతం వాటా రూ. 500 నోట్లదే కావడం గమనార్హం. దేశంలో 2,151 రూ. 500 నోట్లు సర్క్యులేషన్లో ఉండగా.. ఈ సంఖ్య రూ. 100 నోట్ల కంటే 2,007 ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 3,128 పది రూపాయల నోట్లు ఉన్నాయి. సంఖ్య పరంగా చూస్తే.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.10, రూ.100 నోట్లే 47.2 శాతం ఉన్నాయి. అంతకు ముందు ఏడాది ఇది 51.6 శాతంగా ఉండేది. నోట్ల ముద్రణ కోసం 2017-18లో రూ.4912 కోట్లు ఖర్చు చేసిన ఆర్బీఐ.. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4811 కోట్లు ఖర్చు పెట్టింది.


By August 30, 2019 at 11:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rs-2000-notes-circulation-shrinks-and-rs-500-notes-circulation-increases-in-2018-19/articleshow/70904784.cms

No comments