26ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో విజయశాంతి?
తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి-విజయశాంతి జోడీకి హిట్ పెయిర్‌గా పేరుంది. 1990ల్లో వారిద్దరు కలిసి నటిస్తున్నారంటూ ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. యుద్ధభూమి, యుముడికి మొగుడు, కొండవీటి దొంగ, సంఘర్షణ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్, మంచిదొంగ, కొండవీటి రాజా, పసివాడి ప్రాణం.. వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో వీరిద్దరు నటించారు. 1993లో వచ్చిన ‘మెకానిక్ అల్లుడు తర్వాత చిరు-విజయశాంతి మళ్లీ కలిసి నటించలేదు. ఆ తర్వాతి కాలంలో రాజకీయాల్లో చేరడంతో ఆమె నటనకు దూరమయ్యారు. మరోవైపు చిరంజీవికి కూడా పొలిటికల్ ఎంట్రీ కలిసి రాకపోవడంతో తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయారు. ‘ఖైదీ నం.150’తో రీఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు ‘సైరా’తో బాక్సీఫీసును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యారు. ‘సైరా’ తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు.. ఈ సినిమాలో విజయశాంతి కీలకపాత్రలో కనిపించనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ మెగా అభిమానులకు కిక్కిస్తోంది. విజయశాంతి ప్రస్తుతం మహేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరూ’
By August 27, 2019 at 01:01PM
No comments