Breaking News

పెళ్లైన 20 రోజులకే భర్తను చంపేసింది.. కారణం తెలిసి పోలీసులు షాక్


పెళ్లైన 20 రోజులకే భర్తను కిరాతకంగా హతమార్చిందో ఇల్లాలు. నిద్రపోతున్న సమయంలో పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు అంటించింది. అగ్నిప్రమాదం జరిగినట్లు కట్టు కథ అల్లింది.. కానీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా క్లైమాక్స్‌‌లాగా పోలీసులుకు దొరికిపోయింది. భర్తను ఎందుకు హత్య చేశావని ఆరా తీసిన పోలీసులకు ఆమె చెప్పిన సమాధానం షాకిచ్చింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. టీవీ నగర్‌కు చెందిన దక్షిణామూర్తి కుమారుడు సేతుపతి మురుగ వేణి అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. ఇద్దరు పెద్దల్ని ఒప్పించి ఒక్కటయ్యారు. 20 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.. కాపురం సాఫీగా సాగిపోతోంది. గురువారం రాత్రి సేతుపతి ఇంట్లో నిద్రిస్తుండగా ఉన్నట్టుండి మంటలు అంటుకున్నారు. ఇల్లు కాలిపోవడాన్ని చూసిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఘటన అందరూ అగ్నిప్రమాదంగా భావించారు.. తర్వాత కుటుంబ సభ్యులు, స్థానికులకు అనుమానాలు మొదలయ్యాయి. ఇంటికి బయట తాళం వేయడం.. సేతుపతి ఒక్కడే ఇంట్లో ఉండటంతో భార్యపై అనుమానం వచ్చింది. పోలీసులు కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేశారు. మురుగవేణిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. భర్తను తానే హతమార్చినట్లు ఒప్పుకుంది.. హత్యకు కారణాలను పూస గుచ్చినట్లు చెప్పింది. పెళ్లయ్యాక సేతుపతి మనస్తత్వం పూర్తిగా మారిపోయిందని మురుగవేణి చెప్పింది. తనపై అనుమానం పెంచుకొని రోజూ వేధించేవాడని చెప్పుకొచ్చింది. తాగొచ్చి రాత్రిపూట తనను చిత్రహింసలు పెట్టేవాడని.. అసభ్య పదజాలంతో తిట్టేవాడంది. ఆ టార్చర్ భరించలేక భర్తను హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చానంది. గురువారం కూడా సేతుపతి ఫుల్లుగా మందుకొట్టి ఇంటికి వచ్చాడు. ఇదే మంచి అవకాశంగా భావించిన మురుగవేణి భర్తను హతమార్చింది. అందరూ అగ్నిప్రమాదం జరిగిందని అనుకుంటారని భావించింది. డ్యామిట్ కథ అడ్డం తిరిగి దొరికిపోయింది.


By August 03, 2019 at 01:43PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-tamil-nadu-woman-kills-husband/articleshow/70509953.cms

No comments