Breaking News

జమ్ములో 144 సెక్షన్‌ ఎత్తివేత.. తెరుచుకోనున్న విద్యాసంస్థలు


కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి. వారం రోజులుగా భద్రతా బలగాల వలయంలో ఉన్న జమ్మూ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో శనివారం నుంచి అక్కడ 144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు జమ్మూ జిల్లా డిప్యూటీ మెజిస్ట్రేట్ ప్రకటించారు. శనివారం నుంచి విద్యా సంస్థలు పున:ప్రారంభించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. భద్రతా పరమైన ఆంక్షలు ఎత్తివేయడంతో శుక్రవారం జమ్మూలో అనేకమంది ముస్లింలు మసీదులకు వచ్చి ప్రార్థనలు చేశారు. జమ్మూలో పరిస్థితులు చక్కబడుతున్నా కశ్మీర్‌లో మాత్రం ఇంకా ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మునీర్ ఖాన్ తెలిపారు. దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సలహా మేరకు ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు.


By August 10, 2019 at 07:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/144-section-lifted-in-jammu-schools-and-colleges-to-open-from-today/articleshow/70613855.cms

No comments