Nirmala Sitharaman Budget: కేంద్ర బడ్జెట్ 2019-20 లైవ్ అప్‌డేట్స్

లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, తిరిగి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ కోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2025 నాటికి 5 లక్షల ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించాలని మోదీ సర్కారు కోరుకుంటున్న తరుణంలో ఈ బడ్జెట్ కీలకం కానుంది. ఎన్నికల ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు కొనసాగింపుగా.. ఈ బడ్జెట్ ఉండనుంది. ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన, మధ్యతరగతికి ఊరట, రైతాంగం ఎదుర్కొంటున్న దుస్థితిని తీర్చడం, ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలను ఇచ్చేదిశగా బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఆదాయపన్ను పరిమితి పెంపు విషయమై వేతన జీవులు ఆశతో ఉన్నారు. ఇప్పటి వరకు బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ఆర్థిక మంత్రులు సూట్‌కేసులో బడ్జెట్ పత్రాలను తీసుకొచ్చేవారు.. కానీ నిర్మలా సీతారామన్ ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నాలుగు మడతల ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలను తీసుకొని ఆమె పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ వస్త్రంపై ఎర్రటి రాజముద్ర కనిపించింది. భారత సంప్రదాయాన్ని పాటిస్తామని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ క్రిష్ణమూర్తి సుబ్రమణియన్ తెలిపారు. బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.. * ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి బడ్జెట్ కాపీని అందజేశారు. అక్కడి నుంచి పార్లమెంట్‌కు బయల్దేరారు. లోక్‌సభలో ఉదయం 11 గంటలకు సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
By July 05, 2019 at 10:39AM
No comments