Breaking News

కాపులు బానిసలుగా బతకాలా.. జగన్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ


ఏపీలో కాపుల రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రం కేటాయించిన 10శాతం ఈబీసీ (EWS)రిజర్వేషన్లు అగ్రవర్ణాల పేదలందిరికీ అమలు చేస్తామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ రిజర్వేషన్లలో 5శాతం కాపులకు వర్తించవని పరోక్షంగా తేల్చేసింది. దీంతో జగన్ సర్కార్‌ను టీడీపీ టార్గెట్ చేసింది. కాపులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీంతో సోమవారం వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించి.. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి సమస్యను వివరించారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌కు కాపు ఉద్యమ నేత కూడా లేఖ రాశారు. ఈబీసీ కోటాలో ఐదుశాతం రిజర్వేషన్లపై ఏ కోర్టు స్టే ఇచ్చిందో సీఎం జగన్ చెబితే సంతోషిస్తానన్నారు. నిజంగా కోర్టు స్టే ఉంటే తిరిగి ఎన్నికలు వచ్చే వరకు మా డిమాండ్లు హక్కులు అడగకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుంటానన్నారు. కాపు జాతి ఎటువంటి కోరికలు లేకుండా బానిసలుగా బతకాలా అంటూ ప్రశ్నించారు. కేవలం వైసీపీ ప్రభుత్వం ఇస్తామన్న రూ.2వేల కోట్లకు ఆశపడి కాపులు మీకు ఓటేశారని భావిస్తున్నారా అంటూ మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితమే ముద్రగడ జగన్‌కు లేఖ రాశారు. కాపులకు 5శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారో లేదో చెప్పాలన్నారు. తమ జాతిని మోసం చేసినందుకు చంద్రబాబుకు ఘోర ఓటమి ఎదురయ్యిందని.. కనీసీ వైసీపీ ప్రభుత్వమైనా న్యాయం చేయాలని కోరారు. మళ్లీ తాజాగా కాపులకు 5శాతం రిజర్వషన్లు లేవని తేలడంతో లేఖ రాశారు.


By July 29, 2019 at 11:47AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ex-minister-mudragada-padmanabham-letter-to-cm-ys-jagan-on-5-kapu-reservations/articleshow/70428883.cms

No comments