Breaking News

అనంతపురం: గొంతు కోసి ముగ్గురి దారుణ హత్య


జిల్లాలో దారుణం జరిగింది. తనకల్లు మండలం కొర్తికోటలో ముగ్గుర్ని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపడం కలకలంరేపింది. శివాలయం సమీపంలో జరిగిన ఈ ఘటనలో హనుమమ్మ, సత్యలక్ష్మి, శివరామిరెడ్డిలు చనిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి.. మృతదేహాలను పోస్ట్‌మార్ట‌మ్ కోసం పంపించారు. ఈ హత్యలకు ముందు క్షుద్ర పూజలు చేసినట్లు.. గుప్త నిధుల కోసమే ముగ్గుర్ని చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆరా తీసే పనిలో ఉన్నారు. స్థానికుల నుంచి చనిపోయిన ముగ్గురి వివరాలను రాబడుతున్నారు. నాలుగు రోజుల క్రితమే కర్నూలు జిల్లాలో నరబలి ఘటన కలకలంరేపింది. ఆ ఘటన ఓ కొలిక్కి రాకముందే మళ్లీ ముగ్గుర్ని హతమార్చడం సంచలనంగా మారింది.


By July 15, 2019 at 10:16AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/three-brutally-killed-in-anantapur-district/articleshow/70222537.cms

No comments