‘మోదీ రెండు గుళ్లకు వెళితే.. కేసీఆర్ ఆరు ఆలయాలకు వెళ్తారు’

ప్రధాని నరేంద్ర మోదీపై అధినేత, హైదరాబాద్ ఎంపీ మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణలోనూ 2024 ఎన్నికల్లో విజయం సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలపై ఆయన మండిపడ్డారు. హిందూత్వ ముసుగులో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఒవైసీ తూర్పారబట్టారు. శుక్రవారం జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకే హిందూత్వ నినాదాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. మోదీ కంటే కరుడగట్టిన హిందూత్వ వాదిని పేర్కొన్నారు. బహుశా ప్రధాని రెండు గుడులకు వెళ్తే, కేసీఆర్ ఆరు ఆలయాలను సందర్శిస్తారని ఒవైసీ వ్యాఖ్యానించారు. హిందూత్వ విధానంతో ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ భావిస్తోందని, కానీ వారి వ్యూహాలు తెలంగాణలో ఫలించవని అన్నారు. ఈ నినాదంతో కేసీఆర్‌ను గెలవలేరని ఒవైసీ ఉద్ఘాటించారు. తాము హిందూ మతానికి వ్యతిరేకం కాదు, కానీ, హిందూత్వ విధానాలకు మాత్రమే వ్యతిరేకమని ఎంఐఎం నేత స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారని, కాని వారి కల నెరవేరదని ఒవైసీ జోస్యం చెప్పారు. కేసీఆర్‌ని గద్దె ఓడించలేమని తెలిసిన బీజేపీ మూక దాడులకు కుట్రలు పన్నుతోందని దుయ్యబట్టారు. తీగల కుంటలో జరిగిన మూక దాడికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అసదుద్దీన్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
By July 07, 2019 at 11:02AM
No comments