Breaking News

నేడు హైదరాబాద్‌కు అమిత్ షా.. గిరిజన మహిళకు తొలి సభ్యత్వం


భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. దేశవ్యాప్తంగా చేపట్టే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన తెలంగాణ వేదికగా ప్రారంభించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2.40 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ఆయన కేవలం ఆరు గంటలు మాత్రమే ఉండనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకోగానే హోంమంత్రి హోదాలో ఆయన సీఐఎస్ఎఫ్ అధికారులతో ఆయన సమావేశం అవుతారు. ఆ తర్వాత శంషాబాద్ సమీపంలోని రంగనాయకులు తండాలోని గిరిజన మహిళ సోనీ నాయక్‌కు ఇంటికి వెళ్లి తొలి సభ్యత్వాన్ని ఇవ్వనున్నారు. ఆ తర్వాత శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పరిశీలిస్తారు. అనంతరం 7 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుని పార్టీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొగనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పార్టీ స్థితిగతులు, టీఆర్ఎస్‌కు ధీటుగా ఎదిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కీలక నేతలకు గాలం వేయడం వంటి అంశాలపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఢీలా పడినా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఏకంగా నాలుగు స్థానాలు దక్కించుకోవడంపై బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. దీంతో పార్టీని ఎలా బలోపేతం చేయాలో ఆయన నేతలకు సూచనలు ఇవ్వనున్నారు. పార్టీ నేతలతో డిన్నర్ చేసిన అనంతరం ఆయన రాత్రి 8.40 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.


By July 06, 2019 at 07:33AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/bjp-national-president-amit-sha-to-arrive-hyderabad-today/articleshow/70099852.cms

No comments