హిందీలోకి చైతూ-సామ్‌ల ‘మజిలీ’!!
పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. ముఖ్యంగా యూత్,లవర్స్‌ను ఈ సినిమా బాగా అట్రాక్ట్ చేసింది. అయితే లవర్స్‌ను మెప్పించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి.
కాగా.. టాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్టయిన సినిమాలను రీమేక్ చేసే పనిలో బాలీవుడ్ నిర్మాతలు బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ భారీ హిట్టవ్వడంతో తర్జుమా చేసేసుకుని బాలీవుడ్‌లో ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబట్టుకున్నారు.
ఇక ‘మజిలీ’ కూడా మంచి కలెక్షన్లు తెచ్చి పెడుతుందని భావించిన ఓ బడా ప్రొడ్యూసర్ రీమేక్ చేయాలని భావిస్తున్నారట. అయితే ‘మజిలీ’ కంటే ‘గీత గోవిందం’ అయితే ఇంకా బెటర్‌గా ఉంటుందేమోనని.. ఈ రెండింటిలో ఏదో ఒక సినిమాను ఫైనల్ చేసి త్వరలోనే రీమేక్ చేసుకుంటారట. మరి అర్జున్ రెడ్డి తర్వాత హిందీలోకి వెళ్లే సినిమా ఏదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే మరి.
By July 26, 2019 at 09:37PM
No comments