Breaking News

బిగ్‌బాస్ హౌస్‌లోకి మరో ఇద్దరు అందాల భామలు!!


రియాల్టీ షో తెలుగు బిగ్‌బాస్-3 అనేక వివాదాల నడుమ ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమైన విషయం విదితమే. ఇప్పటికే ఐదు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షోను హోస్ట్ అక్కినేని నాగార్జున రక్తికట్టిస్తున్నారు. కాగా హౌస్‌లోకి మొత్తం 15మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టగా వీరిలో 8 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో కొందరు ఇండస్ట్రీకి చెందినవారుండగా.. మరికొందరు బుల్లితెర, యూట్యూబ్‌ స్టార్‌లు ఉన్నారు.

అయితే.. మరొకరు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ‘కుమారి 21 ఎఫ్’తో కుర్రకారు మనసుదోచుకున్న హెబ్బా పటేల్.. మరో హాట్ భామ శ్రద్దాదాస్ వీరిద్దరిలో ఒకరికి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం దక్కనుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఇద్దర్ని కూడా వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇప్పటికే హౌస్‌లో ఎవర్ని ఎలిమినేషన్ చేయాలా అన్న విషయంలో పెద్ద లొల్లి జరుగుతోంది. అయితే ఈ ఇద్దరు హాట్ భామల్లో ఒకరెళ్లినా.. ఇద్దరూ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చినా రచ్చ రచ్చే.!. ఎందుకంటే.. హెబ్బా కుర్రాళ్ళని రెచ్చగొట్టడంలో అందెవేసిన చేయన్న విషయం విదితమే. శ్రద్దా కూడా తానేం తక్కువకాదంటోంది. అయితే హెబ్బాకే ఎక్కువగా హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయట.



By July 26, 2019 at 09:31PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46815/shraddha-das.html

No comments