Breaking News

మహానేతకు నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎ70స్ రాజశేఖర్‌రెడ్డి 70వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తండ్రికి ఘన నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సొంత జిల్లాకు వచ్చిన ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘాట్‌‌ను ఈరోజు ఉదయం సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి మహానేతకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సతీమణి విజయమ్మ, జగన్ భార్య భారతి, సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్‌కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రారెడ్డి తదిరులు పాల్గొని వైఎస్ఆర్‌కు ఘన నివాళులర్పించారు. వైఎస్ అభిమానులు వేల సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయన జోహార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహిస్తోంది. వైఎస్ జయంతిని పురస్కరించుకుని రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. రైతుల కష్టాన్ని దగ్గర నుంచి చూసి అర్థం చేసుకున్న మహానేత పుట్టిన రోజును రైతు దినోత్సవంగా జరిపించాలని తన పాదయాత్రలో చాలామంది కోరారని లేఖలో పేర్కొన్నారు. తన పాదయాత్రలోనూ రైతుల కష్టాన్ని చూశానని, వారి ఆవేదన విన్నానని, నేనున్నానని భరోసా ఇస్తూ ‘రైతు భరోసా పథకం’ కింద 54 లక్షల మంది రైతుల కుటుంబాలకు రూ.8750 కోట్లు పెట్టుబడి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీని ద్వారా 15.36 లక్షల మంది కౌలు రైతులు కూడా లబ్ది కలుగుతుందని వివరించారు.


By July 08, 2019 at 10:08AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cm-ys-jagan-pay-homage-to-his-father-ysr/articleshow/70122672.cms

No comments