Breaking News

‘పావు గంటలోనే ఓటమిని జీర్ణించుకున్నా.. నేనేం స్కాంలు చేయలేదు’


ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు అధినేత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడానికి కారణాలను వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అపజయం గురించి కూడా ప్రస్తావించారు. ప్రజల గొంతుక వినిపించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ వివరించారు. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలే తన కర్తవ్యమని పేర్కొన్నారు. సవాల్ విసరడం వేరని, నిజజీవితంలోకి వచ్చి మాట్లాడాలంటే చాలా గుండె ధైర్యం కావాలన్నారు. ఇదంతా అభిమానులిచ్చిన బలమని, భయపడితే ముందుకు పోలేమని, ఏదైనా సాధించినప్పుడు మరింత ధైర్యం వస్తుందని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీ అపజయం నుంచి కోలుకోడానికి తనకు కేవలం 15 నిమిషాలే పట్టిందన్నారు. తొందరగానే ఓటమిని అంగీకరించి, అర్ధం చేసుకుని బయటకు వచ్చానని, ఎక్కువ సమయం తీసుకోలేదని అన్నారు. అలాగే సక్సెస్ తనకు ఎంత పాఠం నేర్పిందో తెలియదు కానీ, చిన్నతనం నుంచి ఫెల్యూర్స్‌కు తనకు అనే పాఠాలు నేర్పాయని పవన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఓటమీ తనను విజయానికి దగ్గర చేసిందని అన్నారు. కుంభకోణాలు చేస్తూ, ద్రోహాలు చేసి తాను రాజకీయాల్లోకి రాలేదని, విలువల కోసం నిలబడ్డానని అందుకే ఓటమిని సంతోషంగా స్వీకరించానని పేర్కొన్నారు. తనకు తానుగా అన్ని విషయాలను నేర్చుకున్నానని, ఖుషీ తర్వాత సినిమాలపై తనకు ఆసక్తి తగ్గిపోయిందని అన్నారు. అప్పటి నుంచి సమాజం కోసం పనిచేయాలని కోరిక ఏర్పడిందని తెలిపారు. సహనంతో విజయం కోసం ఎదురుచూస్తానని, ఆ గుణాన్ని అలవాటు చేసుకున్నానని వివరించారు. అలాగే రాష్ర విభజనపై కూడా పవన్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ చేసిన తప్పునకు ప్రజలందరూ బాధపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారని ఆయన ధ్వజమెత్తారు. భావితరాల కోసం బలంగా తన వాణి వినిపించాలనే ఉద్దేశంతో పోరాటానికి సిద్ధమయ్యానని తెలిపారు. ఈ పోరాటంలో ఎదురుదెబ్బలు తగలొచ్చని, నలిగిపోవచ్చని అయినా సరే వెనుకడగు వేసే ప్రసక్తేలేదని పవన్ ఉద్ఘాటించారు.


By July 06, 2019 at 10:04AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/janasena-chief-pawan-kalyan-attend-and-inspired-speech-at-tana-conference-2019/articleshow/70101193.cms

No comments