Breaking News

ఫ్యామిలీ లేడీస్ ముసుగులో అపార్ట్‌మెంట్లో వ్యభిచార దందా


ఓ అపార్ట్‌మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార దందాను కృష్ణా జిల్లా పోలీసులు చేధించారు. ఫ్యామిలీ పేరుతో ఓ అపార్ట్‌మెంట్లో ఫ్లాటును అద్దెకు తీసుకున్న ఇద్దరు మహిళలు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి నిర్వహిస్తున్నారు. ఇద్దరు మహిళల వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని ఏడుగురిని అరెస్ట్ చేశారు. పెనమలూరుకు చెందిన కొడాలి కృష్ణవేణి, మున్నంగి రాజ్యలక్ష్మి అనే మహిళలు ఆర్నెల్ల క్రితం యనమలకుదురు డొంకరోడ్డులోని వెగలపూడి రామకోటయ్య వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన యువకులను ఆకర్షించి గుట్టుచప్పుడు కాకుండా దందా నడిపిస్తున్నారు. ఇద్దరు మహిళలు అక్కడి వాచ్‌మెన్‌ను మచ్చిక చేసుకుని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అపార్ట్‌మెంట్‌కు తరుచూ యువకులు వస్తుండాన్ని గుర్తించిన మిగతా ఫ్లాట్లలోని వారు వాచ్‌మెన్‌ను ప్రశ్నించగా వారి బంధువులని చెప్పేవాడు. కృష్ణవేణి, రాజ్యలక్ష్మి ఉంటున్న ఫ్లాట్‌కు శుక్రవారం రాత్రి ముగ్గురు అమ్మాయిలు రావడం, కొద్దిసేపటికే కొందరు యువకులు అక్కడికి చేరుకోవడంతో వ్యభిచారం జరుగుతుందని స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పెనమలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యర్రబోతు బాలనాగరాజు కొమ్మా మణికుమార్‌, నిడమర్రు రామకృష్ణ, షేక్‌ రఫీతో పాటు వ్యభిచార నిర్వాహకులు కృష్ణవేణి, రాజ్యలక్ష్మిని అరెస్ట్ చేశారు.


By July 06, 2019 at 10:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-busted-prostitution-gang-in-penamaluru/articleshow/70101116.cms

No comments