Breaking News

కోడెల కుమార్తెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు!


నరసరావుపేటకు చెందిన వెంకాయమ్మ అనే మహిళ ఫిర్యాదుతో ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె పి.విజయలక్ష్మిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. జూన్ 26న నరసరావుపేట ఒన్‌టౌన్ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 420, 506, ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్‌ 3(1)(ఆర్‌), 3((2)కింద నమోదు చేశారు. ఈ కేసులో విజయలక్ష్మిని ఏ2గా పేర్కొనడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కోడెల కుమార్తెకు ఊరట లభించింది. ఈ కేసులో విజయలక్ష్మిని అరెస్టు చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన కోర్టు, విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. హైకోర్టు ర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ కేసులో విజయలక్షి తరఫు లాయర్ జులై 13న వాదనలు వినిపిస్తూ.. 2014లో జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేశారన్నారు. మొత్తం 8 మంది నిందితులు ఉండగా, తన క్లయింట్‌ను ఏ 2గా చేర్చారని, విజయలక్ష్మి కి సంబంధం లేకపోయినా సివిల్‌ వివాదంలోకి లాగారన్నారు. కాబట్టి దయచేసి నా క్లయింట్‌‌పై నమోదు చేసిన చీటింగ్‌, ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని ఆయన కోరారు. మరో వైపు వెంకాయమ్మ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. శివప్రసాద్‌ రావు కుమార్తె విజయలక్ష్మి‌పై ఇప్పటికే 15 కేసులు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో తాము పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అడ్డుకున్నారని, కాబట్టి ఈ కేసు కొట్టివేయకూడదని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. నరసరావుపేటకు చెందిన అర్వపల్లి పద్మావతి అనే మహిళ సైతం గత నెలలో విజయలక్ష్మిపై ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడి తన వద్ద డబ్బులు వసూలుచేశారని ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదయ్యింది. పద్మావతి అనే మహిళ కేసానుపల్లిలో 2002లో రెండెకరాల భూమి కొనుగోలు చేయగా, పొలం సాగు చేసుకోవాలంటే తమకు రూ.20 లక్షలు చెల్లించాలని బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కళ్యాణం రాంబాబు అనే వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. తాను అంత మొత్తం చెల్లించలేనని, రూ.15 లక్షలు చెల్లిస్తానని పద్మావతి చెప్పింది. ఈ మొత్తాన్ని ఆమె మూడేళ్లలో విడతల్లో ముందుగా అనుకున్న ప్రకారం రూ.15 లక్షలు చెల్లించింది. జూన్ 6న మరో రూ.5 లక్షలు చెల్లించాలని కోడెల కుమార్తె , బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కళ్యాణం రాంబాబులు తనను బెదిరించడమే కాదు, అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో చేసింది.


By July 25, 2019 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/former-speaker-kodela-daughter-relax-court-orders-against-arrest-in-sc-st-atrocity-case/articleshow/70372569.cms

No comments