ఇలాగైతే ఇబ్బందులు తప్పవు: కిషన్ రెడ్డి
అంతరించి పోతున్న ప్రకృతి సంపదను కాపాడుకోకపోతే భవిష్యత్తులో అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఆదివారం (జులై 21) 'ది సొసైటీ ఆఫ్ ఎర్త్ సైంటిస్ట్' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రోడ్డులో ‘వాక్ టు సేవ్ అవర్ జియో హెరిటేజ్’ పేరిట నిర్వహించిన ప్రత్యేక 'రన్'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకు అంతరించి పోతున్న ప్రకృతి సంపదను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. మనుషులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నాడని.. కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి సంపదను కాపాడటంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
By July 21, 2019 at 01:55PM
No comments