Breaking News

కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. టీచర్‌పై ప్రిన్సిపాల్ అత్యాచారం


దేశంలో మహిళలకు ఎక్కడా భద్రత లేకుండా పోతోంది. చదువుకునే చోట, ఉద్యోగాలు చేసే చోట ఇలా ఎక్కడికెళ్లినా కామాంధుల వికృత చేష్టలు వారి జీవితాలను నాశనం చేస్తూనే ఉన్నాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు సైతం ఇలాంటి పెడధోరణులు పట్టడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటన పాఠశాలలో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని జసోలా ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ తనను రెండేళ్లుగా చేస్తున్నాడని అదే స్కూల్‌లో పనిచేస్తున్న మహిళా టీచర్(27) పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017లో ఓ రోజు విద్యార్థులకు ఎక్స్‌ట్రా క్లాస్ తీసుకోవాలని ప్రిన్సిపాల్ రాకేశ్ సింగ్ కోరడంతో రాత్రి వరకు స్కూల్‌లో ఉన్నానని, ఆ సమయంలో తన గదిలోకి పిలిచిన రాకేశ్ తనకు కూల్‌డ్రింక్ ఇచ్చాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. డ్రింక్ తాగిన వెంటనే తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా ప్రిన్సిపాల్ అదే రూమ్‌లో తనపై అత్యాచారానికి పాల్పడి సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడని తెలిపింది. అపస్మారక స్థితి నుంచి తేరుకున్నాక జరిగిన అఘాయిత్యంపై నిలదీయగా రాకేష్ తనను బెదిరించాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్‌మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. పిలిచినప్పుడల్లా తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడని, కుటుంబ పరువు పోతోందన్న ఆందోళనతోనే రెండేళ్లుగా ఓపిక పడుతున్నానని, ఇక భరించలేకే ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాకేశ్ సింగ్‌ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.


By July 05, 2019 at 10:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/delhi-police-arrests-school-principal-over-he-rapes-teacher/articleshow/70084233.cms

No comments