Breaking News

కోదాడ-విజయవాడ రహదారిపై రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి


హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నెత్తురోడింది. జిల్లా సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని పాతపట్నంకు చెందిన ఓ కుటుంబం గురువారం రాత్రి అర్ధరాత్రి తుఫాన్ వాహనంలో హైదరాబాద్ నుంచి స్వస్థలానికి బయలుదేరింది. వారు ప్రయాణిస్తున్న వాహనం సూర్యపేట జిల్లాలోని కోదాడ సమీపంలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద ఓ మలుపులో యూటర్న్ తీసుకుంటున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మమ్మ(95), తెల్ల నాగమ్మ(55) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహన డ్రైవర్ ఏలేటి ప్రవీణ్‌తో పాటు లోకేశ్, రంగారావు, కృష్ణ, బాబూరావు, రమ, మౌనిక, స్వాతి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న కోదాడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. ఈ ఘటనలో హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదానికి గురైన వాహనాలను అక్కడి తరలించిన పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరించారు.


By July 05, 2019 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/road-accident-near-near-kodad-in-suryapet-district-2-died/articleshow/70082038.cms

No comments