Breaking News

షో మాస్టర్లొద్దు.. టాస్క్ మాస్టర్లు కావాలి: కేశినేని నాని సంచలన పోస్ట్


టీడీపీకి స్వపక్షంలో విపక్షంలా మారారు ఎంపీ . రోజుకో ఫేస్‌బుక్ పోస్టుతో ఆసక్తిరేపుతున్న విజయవాడ ఎంపీ.. పార్టీ నేతలు, అధిష్టానాన్ని టార్గెట్ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలపైనా పోస్టులతో సంచలనాలు రేపారు. అయితే కొద్దిరోజులుగా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ.. సొంత పార్టీ నేతల జోలికి వెళ్లలేదు. తాజాగా మళ్లీ సొంత పార్టీపై మరో పోస్ట్‌తో హాట్‌టాపిక్ అయ్యారు. ఈసారి ఏకంగా పార్టీపై పోస్ట్‌ను గురి పెట్టారు. కేశినేని తన పోస్ట్‌లో ‘టీడీపీకి టాస్క్ మాస్టర్లు కావాలి.. షో మాస్టర్లు వద్దూ’అంటూ హితవు పలికారు. అంటే పార్టీలో షో మాస్టర్లకు అవకాశం ఇవ్వొద్దు.. టాస్క్ మాస్టర్లు కావాలంటూ పార్టీ అధిష్టానానికి సూచన చేశారు. విజయవాడ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన కేశినేని పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కూడా అధిష్టానంపై అలకబూనారు. సొంత పార్టీ నేతల్ని కేశినేని నాని టార్గెట్ చేశారు. సొంత పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాపై పోస్ట్‌తో సంచలనం సృష్టించారు. దీంతో అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి బుజ్జగించడంతో మెత్తబడ్డారు. పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మళ్లీ ఇప్పుడు మరో పోస్ట్‌తో సంచలనం రేపారు.


By July 09, 2019 at 12:02PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/vijayawada-mp-kesineni-nani-satirical-fb-post-on-tdp-leaders/articleshow/70139387.cms

No comments