Breaking News

విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?


ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు విజయ్ దేవరకొండ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం భారీ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కి బెస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖాయమే. అయినప్పటికీ విజయ్ దేవరకొండ ఊరుకోవడం లేదు.. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో యువతను, ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఈ సినిమా గనక హిట్ అయ్యిందా సౌత్ లో బిగ్ స్టార్ గా విజయ్ పేరు మార్మోగడం ఖాయం. తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడలో విజయ్ డియర్ కామ్రేడ్ విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో పాటుగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆనంద్ అన్నామ‌లై దర్శకత్వంలో హీరో అనే సినిమాలోనూ నటిస్తున్నాడు.

అయితే భారీ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ హీరో చిత్రం షూటింగ్ ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై కొంతమేర షూటింగ్ కూడా జరుపుకుంది. హీరో కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా ఢిల్లీ లో బైక్ రేసింగ్ లో శిక్షణ పొందాడు. ఇక ఈ హీరో సినిమాలో బైక్ రేసింగ్ సీన్స్ కోసం అప్పుడే 2 కోట్లకు పైగా నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ బైక్ రేసింగ్ సీన్స్ అవుట్ పుట్ చూశాక నిర్మాత‌లు పెద‌వి విరిచార‌ని.... అంతే కాకుండా దర్శకుణ్ణి ఇప్పుడు హీరో స్క్రిప్టులోనూ మార్పులు చేర్పులు చేయ‌మంటున్నార‌ని టాక్‌. అయితే దర్శకుడు మళ్లీ స్క్రిప్ట్ మార్చాక అది గనక నిర్మాతలకు ఓకే అనిపిస్తేనే హీరో సినిమా సెట్స్ మీదకెళుతుందట. మరి విజయ్ క్రేజ్‌కి ఈ హీరో సినిమా ఆగిపోవడం ఏమన్నా బ్రేక్ వేస్తుందేమో అంటూ విజయ్ అభిమానులు కంగారు పడుతున్నారు.



By July 26, 2019 at 03:38AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46803/vijay-deverakonda.html

No comments