'ఇప్పుడు పోర్ట్ ఇస్తారు.. రేపు పాలన చేతకాదని రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారా'
తెలుగు రాష్ట్రాల్లో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బందరు పోర్ట్‌ను తెలంగాణకు అప్పగిస్తారంటూ మళ్లీ ప్రచారం మొదలయ్యింది. తెర వెనుక పోర్ట్‌ను తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత .. మాజీ మంత్రి లోకేష్‌లు ట్వీట్లు చేయడం మళ్లీ ఆసక్తిగా మారింది. లోకేష్ తన ట్వీట్‌లో ‘ఈరోజు చేతకాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని గారి చేతుల్లో పెడతారా? ఇలాంటి అసమర్థులు ఒక్క ఛాన్స్ ఎందుకోసం అడిగారు? దోచుకోడానికా? ప్రజల భవిష్యత్తును పక్క రాష్ట్రాలకు తాకట్టుపెట్టడానికా?’అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. ఇటు చంద్రబాబు కూడా స్పందించారు. ‘బందరు పోర్టును ఏళ్ళ తరబడి నిర్లక్ష్యం చేస్తుంటే... మచిలీపట్నం డీప్ వాటర్‌పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి మా తెదేపా ప్రభుత్వం నడుం కట్టింది. ఇందుకోసం మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థను 2017 మార్చిలో ఏర్పాటు చేసాం’అన్నారు. ‘వైసీపీ వచ్చాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 28, 2019న RT -62 జీవోను 'రహస్య' జీవోగా జారీ చేసి, రెండు రోజుల్లో 'జారీ చేయబడలేదు' అని మార్చారు. తెలంగాణకు ఇస్తున్నారా? అని అసెంబ్లీలో అడిగితే లేదని బుకాయించారు. కానీ పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతూనే ఉన్నాయి. సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరం. ఇలాంటి పోర్టుల పై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీలేదు. మీ స్నేహాలకు, సొంత లాలూచీలకు రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే తెదేపా సహించదు’అంటూ హెచ్చరించారు.
By July 29, 2019 at 12:22PM
No comments