Breaking News

పూరీని వదిలి పోనంటుంది..!


హీరోయిన్‌గా కెరీర్ ముగియగానే దర్శకుడి పూరి జగన్నాధ్ చెంతకు చేరి ఆయన పూరి కనెక్ట్స్‌లో భాగమై సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది హీరోయిన్ ఛార్మి. ఎన్ని ప్లాప్స్ వచ్చినా పూరిని వదలకుండా ఉన్న ఛార్మికి ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవడంతో పూరి, ఛార్మి పోగొట్టుకున్నదంతా ఇచ్చేసాడు. ఇక ఇస్మార్ట్ హిట్ లో ఛార్మి కష్టం చాలా దాగుందని పూరి అనేకసార్లు చెప్పాడు. బడ్జెట్ కంట్రోల్ చేసే విషయాన్నీ పూర్తిగా పూరి, ఛార్మికి అప్పగించాడు. అలాగే నటీనటుల ఎంపిక దగ్గరనుండి వారి రెమ్యునరేషన్ విషయం వరకు.... అలాగే సెట్స్ లో బడ్జెట్ కంట్రోల్ విషయంలో ఛార్మి చాలా తెలివిగా వ్యవహరించి ఖర్చు తగ్గించబట్టే ఇస్మార్ట్ శంకర్ కి బడ్జెట్ కంట్రోల్ జరిగి భారీ లాభాలొచ్చాయి.

అయితే ఇప్పుడు ఛార్మి ఇస్మార్ట్ శంకర్ కి బడ్జెట్ కంట్రోల్ విషయంలో బాగా హైలెట్ అవడంతో... ఇప్పుడు చాలామంది నిర్మాణ సంస్థలు ఛార్మిని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా చూస్తున్నారట. దానికోసం ఎన్నికోట్లయినా ఛార్మికి ఇచ్చేందుకు వారు సిద్దమవుతున్నారట. ఇక మరోపక్క ఇస్మార్ట్ హిట్ తో పూరి తో సినిమాలు చేసేందుకు పలు నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయని కూడా ఫిల్మ్‌నగర్ టాక్.

అయితే ఏ నిర్మాణ సంస్థ అయినా తనతో సినిమా చేయాలి అంటే... ఛార్మిని సహ నిర్మాతగా చేర్చుకోమని పూరి సదరు నిర్మాతలకు కండిషన్స్ పెడుతున్నాడట. గతంలో ఇలాంటి వార్తలొచ్చినా.. తాజాగా మాత్రం పూరి కండిషన్స్ కి సదరు నిర్మాతలు కూడా ఒప్పుకునేటట్లే ఉన్నారని వినికిడి. ఇక ఛార్మి మాత్రం పూరిని వదిలి బయట నిర్మాణ సంస్థలకు పనిచేసే ఛాన్స్ అయితే కనబడడం లేదు.



By July 30, 2019 at 04:13AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/46856/charmee.html

No comments