Breaking News

యాంకర్ అనసూయ పేరుతో వల్గర్ పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు


స్మార్ట్‌ఫోన్ల రాకతో వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వ్యక్తిగత విషయాలతో పాటు దేనిపై అయినా తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే సదుపాయం ఉండటంతో కోట్లాది మంది నిత్యం సోషల్‌మీడియాలో విహరిస్తుంటారు. అయితే సోషల్‌మీడియా వల్ల ప్రయోజనం కంటే ఇబ్బందులే ఎక్కువ ఉంటాయని నిపుణులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోరు. చాలామంది సెలబ్రెటీలు తమ అభిమానులకు దగ్గరగా ఉండేందుకు సోషల్‌మీడియాలో తమ సమాచారాన్ని, లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇక్కడే వారికి చేదు అనుభవం ఎదురవుతోంది. ‘బజర్దస్’ కామెడీ షో ద్వారా ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్న భరద్వాజ్.. అనేక సినిమాల్లోనూ నటించి సత్తా చాటుకున్నారు. తనకు సంబంధించి ఏ సమాచారాన్నైనా ఆమె వెంటనే సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. హాట్‌హాట్ ఫోటోలు సైతం పోస్ట్‌చేస్తూ నెటిజన్లను ఫిదా చేస్తుంటారు. అనసూయ పోస్టులకు ఎంతమంది పాజిటివ్ స్పందిస్తారో.. అంతకంటే ఎక్కువ మంది తిట్టిపోస్టుంటారు. ఇటీవల అనసూయ పేరుతో సోషల్‌మీడియాలో అనేక అకౌంట్లు దర్శనమిస్తున్నాయి. వాటిలో అసభ్య రాతలు రాస్తూ, ఆమెకు సంబంధించిన అశ్లీల ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రోగ్రెసివ్ యూత్‌లీగ్ ప్రతినిధులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుచేశారు. అనసూయ భరద్వాజ్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి అసభ్యంగా రాస్తున్నారని, యాప్‌ల సాయంతో ఆమె వ్యక్తిగత పోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని యాప్స్‌ల్లో అనసూయ ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా చిత్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని తొలగించాలని ప్రోగ్రెసివ్ యూత్‌లీగ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్‌ ప్రదీప్‌ నేతృత్వంలోని బృందం ఈ ఫిర్యాదు అందజేసింది. రాజకీయ నాయకులు, సెలబ్రెటీలపై సోషల్‌మీడియాలో అశ్లీల, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నవారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


By July 22, 2019 at 10:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/fake-posts-in-social-media-anchor-anasuya-named-pyl-workers-complaint-to-hyderabad-cyber-police/articleshow/70324463.cms

No comments