Breaking News

వృద్ధుడితో వ్యభిచారం చేయాలని బాలికకు వేధింపులు


మైనర్ బాలికను కూపంలోకి దించేందుకు యత్నించడం బంజారాహిల్స్‌ పరిధిలో కలకల రేపింది. కుందన్‌బాగ్‌లో నివసించే బాలికకు అదే వీధిలో ఉండే ఓ మహిళతో పరిచయమైంది. ఆ మహిళ 15రోజుల క్రితం బాలికను రోడ్ నంబర్ 4లోని ఓ అపార్ట్‌మెంట్లో ఉండే తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్లింది. కొద్దిసేపటి తర్వాత అదే అపార్ట్‌మెంట్లోని ఓ ఫ్లాట్‌లో ఉంటే ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లాలని బాలికకు చెప్పారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాలిక అక్కడి నుంచి పారిపోయింది. ఈ విషయం తల్లికి చెప్పొద్దని హెచ్చరించిన మహిళ ఆ బాలికకు వస్తువులు కొనిచ్చింది. గురువారం ఆ మహిళ ఇంటికి వెళ్లిన బాలికపై ఆమె భర్త అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీరిస్తే డబ్బులిస్తానని చెప్పి అఘాయిత్యం చేయబోయాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె స్థానికులను వెంటబెట్టుకుని వెళ్లి గొడవ పడింది. ఇదే క్రమంలో 15రోజుల క్రితం బాలికను వ్యభిచార చేయాలని ఒత్తిడి తీసుకొచ్చిన విషయం కూడా వెలుగులోకి రావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్ పోలీసులు మహిళ, ఆమె భర్త, ఫ్రెండ్‌పై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. పేద కుటుంబాల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకొని కొంతమంది మహిళలు వారి ఆడ పిల్లలను వ్యభిచార కూపంలోకి దించుతున్నారని, ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


By July 26, 2019 at 09:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/17-year-old-girl-forced-into-prostitution-by-two-women-in-hyderabad/articleshow/70389259.cms

No comments